: దర్శకుడు మణిరత్నాన్ని వెంటాడుతున్న 'కడలి'


తమిళ దర్శకుడు మణిరత్నాన్ని 'కడలి' సినిమా వెంటాడుతోంది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా దారుణంగా పరాజయం పొందిన నేపథ్యంలో పంపిణీదారులు ఇటీవల ఆయన ఇంటిపై దాడి చేసిన సంగతి మనకు తెలిసిందే. దీనికి తోడు ఇప్పుడు కోర్టు కేసు కూడా ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఈ సినిమాలో క్రైస్తవులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయనీ, అందువల్ల చిత్ర ప్రదర్శనను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయాలనీ కోరుతూ, జాన్సన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారణకు చేబట్టిన న్యాయమూర్తి, ఈ నెల 23 లోగా వివరణ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా మణిరత్నంతో బాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించారు.

  • Loading...

More Telugu News