Chandrababu: రేపు చంద్రబాబు షెడ్యూల్ ఇదే!
- ఉదయం పది గంటలకు పోలవరం పయనం
- తిరిగి 2 గంటలకు అమరావతి రాక
- ఆపై పార్టీ సమీక్షలు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమీక్షల విషయంలో వెనక్కి తగ్గేదిలేదని నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. ఆయన తాజా వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. పోలవరం ప్రాజక్టు పనులను పరిశీలించడానికి వెళుతున్నానని, అదేమీ ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో రేపటి చంద్రబాబు పోలవరం పర్యటన అటు అధికార వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది.
సోమవారం ఉదయం 10 గంటలకు చంద్రబాబు పోలవరం వెళ్లనున్నారు. ముఖ్యులతో కలిసి పోలవరం ప్రాజక్టు పనులు పరిశీలించి, పనులు జరుగుతున్న తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అమరావతి చేరుకుంటారు. అక్కడ్నించి అమలాపురం లోక్ సభ స్థానంపైనా, ఆ లోక్ సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపైనా సమీక్ష చేపడతారు.