Andhra Pradesh: తుపాను నేపథ్యంలో కోడ్ సడలించాలంటూ ఏపీ ప్రభుత్వం నుంచి మాకు ప్రతిపాదన రాలేదు: ద్వివేది

  • ప్రతిపాదన వస్తే సీఈసీకి పంపిస్తాం
  • ఈవీఎంలకు ఏమీ కాదు
  • స్ట్రాంగ్ రూంలు తుపాను తీవ్రత తట్టుకోగలవు

ఫణి తుపాను గంటగంటకు భీకర రూపు దాల్చుతున్న నేపథ్యంలో సహాయ చర్యల కోసం కోడ్ సడలించాలంటూ ఏపీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎక్కడైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కోడ్ సడలించే విషయంలో కానీ, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కానీ కేంద్ర ఎన్నికల సంఘానికే అధికారం ఉంటుందని ద్వివేది తెలిపారు.

తుపాను నేపథ్యంలో కోడ్ వెసులుబాటుపై ఏపీ సర్కారు నుంచి ఎలాంటి ప్రతిపాదన వచ్చినా వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి దృష్టికి తీసుకెళతానని వెల్లడించారు. కాగా, ఫణి తుపాను తీవ్రత దృష్ట్యా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణ విభాగం హెచ్చరిస్తున్న నేపథ్యంలో, అక్కడ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలకు ఏమీ కాదని, తుపాను తీవ్రత తట్టుకోగలవని ద్వివేది అభిప్రాయపడ్డారు. తుపాను వల్ల ఈవీఎంలకు ఎలాంటి నష్టం ఉండబోదని అన్నారు.

  • Loading...

More Telugu News