Vijayasanthi: ఏపీలో తప్పయింది తెలంగాణలో ఒప్పవుతుందా? జగన్ గారే చెప్పాలి: విజయశాంతి సూటి ప్రశ్న

  • ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన రాములమ్మ
  • ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతివ్వడంపై జగన్ ను నిలదీసిన వైనం
  • స్పందించని వైసీపీ నేతలు

రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి ఫెడరల్ ఫ్రంట్ విషయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని నిలదీశారు. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ మద్దతిస్తున్నట్టు చెబుతున్నారని, కానీ, ఆయన ఏ కోణంలో మద్దతిస్తున్నారో చెప్పాలని కోరారు.

"వైసీపీ శాసనసభ్యులు టీడీపీలో చేరేలా అసెంబ్లీ స్పీకర్ ప్రోత్సహించాడంటూ రెండేళ్ల పాటు ఏపీ అసెంబ్లీని బహిష్కరించారు. మరి, తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వ్యక్తి ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ మద్దతు ప్రకటించడం ఏమైనా న్యాయమా? ఏపీలో తప్పయిన ఫిరాయింపులు తెలంగాణలో ఏ విధంగా ఒప్పవుతాయో జగన్ చెప్పాలి. కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడంపై జగన్ అభిప్రాయం ఏంటో వివరించాలి" అంటూ విజయశాంతి ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.

అయితే, దీనిపై ఇటు వైసీపీ నేతలు కానీ, అటు టీఆర్ఎస్ నేతలు కానీ ఎవరూ స్పందించలేదు.

  • Loading...

More Telugu News