BJP: గ్లోబరినాను బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఒప్పందం రద్దు చేయాలి: టీ- బీజేపీ చీఫ్ లక్ష్మణ్ డిమాండ్

  • ఇంటర్ బోర్డు కార్యదర్శిని సస్పెండ్ చేయాలి
  • టెక్నికల్ కమిటీతో ఒరిగేదేమీ లేదు
  • గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు

తెలంగాణ బీజేపీ నేతలు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసి ఇంటర్ మార్కుల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు ఇవాళ గవర్నర్ ను కలిశారు. ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై న్యాయవిచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, ఇంటర్ మార్కుల వ్యవహారంలో న్యాయవిచారణ అవసరమని తాము భావిస్తున్నట్టు తెలిపారు.

ఈ తప్పులతడకకు విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి బాధ్యత వహించాలని, ఆయనను బర్తరఫ్ చేసేంతవరకు బీజేపీ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అసలీ గందరగోళానికి కారణమైన గ్లోబరినా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టి, ఆ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ను కూడా సస్పెండ్ చేయాలని అన్నారు. ఇంత నష్టం జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని లక్ష్మణ్ పెదవి విరిచారు.

BJP
  • Loading...

More Telugu News