Chandrababu: ఈస్టర్ పండుగ సందర్భంగా జీసస్ గురించి చెప్పిన చంద్రబాబు
- క్రీస్తు బోధనలు అనుసరణీయం
- ఐదేళ్ల పాలనలో క్రిస్టియన్ల కోసం అనేక పథకాలు తీసుకొచ్చాం
- దేశవిదేశాల్లో ఉన్న క్రైస్తవులకు సీఎం శుభాకాంక్షలు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏసుక్రీస్తు విశిష్టతలను వివరించారు. క్రీస్తు తన జీవితకాలంలో శాంతి, సోదరభావం, భద్రత, ఇతర మతాల పట్ల గౌరవం తదితర అంశాల కోసమే పాటుపడ్డారని పేర్కొన్నారు. మానవత్వంతో కూడిన శాంతియుత జీవనం క్రీస్తు ఎంచుకున్న మార్గం అని, ఆయన బోధించింది కూడా అదేనని చంద్రబాబు తెలిపారు.
జీసస్ బోధనలు అందరూ అనుసరించాలని, ఆయనో గొప్ప మార్గదర్శకుడని కొనియాడారు. టీడీపీ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో క్రిస్టియన్ల కోసం అనేకరకాల పథకాలు తీసుకొచ్చిందని, రాష్ట్రంలో మత సామరస్యం కోసం పాటుపడ్డామని చెప్పారు. ఈస్టర్ సందర్భంగా ఆయన రాష్ట్రంలో ఉన్నవారితో పాటు దేశవిదేశాల్లో ఉన్న క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు.