Andhra Pradesh: ఈసీని అప్రతిష్టపాలు చేస్తున్న చంద్రబాబును అరెస్ట్ చేయాలి: జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి
- ఏపీ సీఎస్ పై చంద్రబాబు వ్యాఖ్యలు తగదు
- బ్యాలెట్ విధానం మంచిదని బాబు చెప్పడం అశాస్త్రీయం
- ఓటమి భయంతో ఈవీఎంలు, ఈసీని సాకుగా చూపుతున్నారు
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ‘కోవర్ట్’గా చంద్రబాబు అభివర్ణించడం తగదని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఏపీ జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి అన్నారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చంద్రబాబుకు తగదని, ఈసీని అప్రతిష్టపాలు చేస్తున్న బాబును అరెస్ట్ చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గవర్నర్ పాలన తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఓటమి భయంతో ఈవీఎంలను, ఎన్నికల సంఘాన్ని బాబు సాకుగా చూపుతున్నారని విమర్శించారు. ఈవీఎంల కన్నా బ్యాలెట్ విధానం మంచిదని చంద్రబాబు చెప్పడం అశాస్త్రీయమని అన్నారు.