: కళంకిత మంత్రులపై రాష్ట్రపతిని కలవనున్నాం: బాబు
కళంకిత మంత్రులను కాపాడేందుకు ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్ ఏ చర్యలూ తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. అవినీతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్నది టీడీపీయేనన్న బాబు, అక్రమార్కులు సంపదను హవాలా రూపంలో దేశం దాటిస్తున్నారని, వార్ని శిక్షించాలని డిమాండ్ చేసారు. కళంకిత మంత్రులపై రాష్ట్రపతిని కలిసేందుకు ఈ నెల 22, 23 న అనుమతి కోరుతున్నామని తెలిపారు. ఓబుళాపురం గనులపై టీడీపీ అవిశ్రాంత పోరాటం చేసిందన్న బాబు పిల్ల కాంగ్రెస్ అవినీతిపై మంత్రులు మాట్లాడరని విమర్శించారు.