: రాజకీయాల్లోకి లాలూ కుమార్తె


లాలూ ఇంట నేతల పంట పండుతోంది. ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కొడుకులు రాజకీయాలలోకి ప్రవేశించగా, త్వరలో ఆయన కూతురు మిశా భారతి కూడా రాజకీయారంగేట్రం చేయనున్నారు. లాలూ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పరివర్తన్ ర్యాలీలో మిశా కూడా పాలు పంచుకుంటున్నారు. రాజకీయ నేతల వారసులు రాజకీయాల్లోకి ప్రవేశించడం కొత్తేమీ కాదని మిశా మీడియా ముందు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తనకు రాజకీయాలంటే ఆసక్తి అని చెప్పారు. మిశా భారతి వివాహితురాలు.

లాలూ, ఆయన శ్రీమతి రబ్రీదేవి ఇప్పటికే రాజకీయాలలో చురుగ్గా ఉన్నారు. లాలూ తన పెద్ద కొడుకు తేజ ప్రతాప్ ను గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలోకి దింపారు. 2010 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిన్న కొడుకు తేజశ్వి కూడా ప్రచారంలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News