chandrababu: మే 23 తర్వాత మంచి రోజు చూసుకుని ప్రమాణస్వీకారం చేస్తా: చంద్రబాబు
- నా ఓటు నా పార్టీకే పడిందో, లేదో?
- గతంలో ఓటు వేస్తే నమ్మకం ఉండేది
- రీకౌంటింగ్ జరిపినా నమ్మే పరిస్థితి లేదు
ఈవీఎంల పని తీరుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఓటు తన పార్టీకే పడిందా? లేక వేరే పార్టీకి పోయిందా? అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఓటేస్తే పూర్తి నమ్మకం ఉండేదని... ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. రీకౌంటింగ్ జరిపినా నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.
అయితే, ఏదిఏమైనా, టీడీపీ ఘన విజయం సాధించబోతోందని... మే 23 తర్వాత మంచి రోజు చూసుకుని ప్రమాణస్వీకారం చేస్తానని అన్నారు. దీని గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. మరోవైపు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని రేపు చంద్రబాబు కలవనున్నారు.