: బీజేపీ కార్యాలయం ముట్టడికి యువజన కాంగ్రెస్ యత్నం


ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన మంత్రి రాజీనామా చేయాలన్న బీజేపీ డిమాండ్లపై యువజన కాంగ్రెస్ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. బీజేపీ డిమాండ్లను వ్యతిరేకిస్తూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బారీకేడ్లను ఛేదించుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అయినా వారు వినకపోవడంతో.. జల ఫిరంగులతో చెల్లాచెదురు చేశారు. ముందస్తుగా అక్కడ 144 సెక్షన్ విధించారు. ప్రధాని రాజీనామా చేయాలంటూ కోరడాన్ని బీజేపీ తక్షణం ఆపాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News