Telugudesam: మదనపల్లె టూటౌన్ సీఐపై ఈసీ వేటు

  • టీడీపీ ప్రచారసభలో కోడ్ ఉల్లంఘన జరిగినా కేసు పెట్టలేదు
  • అందుకే తొలిగించామన్న ఈసీ
  • కొత్త సీఐ నియామకం కోసం డీఐజీకి ఆదేశాలు

మరికొన్నిరోజుల్లో పోలింగ్ జరగనున్న తరుణంలో ఏపీలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ఎన్నికల సంఘం ఇప్పుడు దిగువస్థాయి అధికారులపైనా చర్యలకు ఉపక్రమించింది. తాజాగా, ఎన్నికల నియమావళికి అనుగుణంగా వ్యవహరించలేదంటూ మదనపల్లె టూటౌన్ సీఐ సురేష్ కుమార్ పై బదిలీ వేటు వేసింది. సురేష్ కుమార్ ను విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో మరో సీఐ కోసం మూడు పేర్లు సూచించాలంటూ ఎన్నికల సంఘం డీఐజీని ఆదేశించింది.

తెలుగుదేశం పార్టీ ప్రచారం సందర్భంగా ఎన్నికల నియమావళికి భంగం కలిగిందని ఎన్నికల పరిశీలకుడు నవీన్ కుమార్ ఫిర్యాదు చేసినా సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేయలేదంటూ ఆయన తొలగింపునకు ఈసీ కారణం చెప్పింది. సురేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ నవీన్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News