Jagan: కుప్పంలో జగన్ రోడ్ షోలో తొక్కిసలాట.. ఒకరి మృతి

  • రోడ్ షో అనంతరం తొక్కిసలాట
  • స్పృహ కోల్పోయిన వ్యక్తి
  • చికిత్స పొందుతూ మృతి

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వెస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ కుప్పం రోడ్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే, జగన్ రోడ్ షో అనంతరం అభిమానులు తిరుగుముఖం పడుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. స్వల్ప తొక్కిసలాటే అయినా ఓ వ్యక్తి స్పృహ కోల్పోయాడు. ఆపై చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మృతుడిని శాంతిపురం మండలంలోని 121 పెద్దూరు గ్రామ తాజా మాజీ సర్పంచ్ బేట్రాయుడిగా గుర్తించారు. ఆయన వయసు 40 సంవత్సరాలు. స్పృహ కోల్పోయిన బేట్రాయుడ్ని వైసీపీ కార్యకర్తలు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినా ప్రయోజనం లేకపోయింది. కొన్నిరోజుల క్రితం గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జగన్ రోడ్ షో నిర్వహించినప్పుడు కూడా దుర్ఘటన జరగింది. కరెంట్ షాక్ తో ఒకరు మృత్యువాత పడ్డారు. ఆ ఘటన మరువకముందే కుప్పంలో తాజా అపశ్రుతి చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News