: వీఐపీ భక్తులూ.. సంపద్రాయ వస్త్రాలు ధరిస్తేనే దర్శనం
నేటి నుంచీ తిరుమల శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్ర ధారణలోనే వెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు టీడీడీ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ నిబంధన ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు అమలవుతోంది. త్వరలో ఇదే నిబంధన శ్రీవారి భక్తులందరికీ అమలు చేయాలని టీడీడీ యోచిస్తోంది.