Telugudesam: శాంతిభద్రతల పరిశీలకుడిగా కేకే శర్మ వద్దు.. టీడీపీ నేతల డిమాండ్
- శర్మతో రాజకీయపక్షాల సమావేశం
- ఆయనకు ఆర్ఎస్ఎస్ తో సంబధాలున్నాయి
- శర్మపై వ్యతిరేకత వ్యక్తం చేసిన వర్ల, పట్టాభి
ఏపీలో ఎన్నికల వేళ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో అధికార టీడీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈసీ ఇప్పటికే కొందరు కీలక ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం, నిరుద్యోగ భృతి పెంపుకు నో చెప్పడం టీడీపీకి మింగుడుపడడంలేదు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర శాంతిభద్రతల పరిశీలకుడిగా నియమితుడైన కేకే శర్మను తొలగించాలని తెలుగుదేశం పార్టీ నేతలు వర్ల రామయ్య, పట్టాభి అంటున్నారు. కేకే శర్మ గతంలో బీఎస్ఎఫ్ డీజీగా వ్యవహరించిన సమయమంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు హాజరయ్యేవారని టీడీపీ నేతలు ఆరోపించారు. శర్మకు ఆర్ఎస్ఎస్ తో సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిశీలకుడిగా ఉంటే నిష్పాక్షిత లోపిస్తుందని భావిస్తున్నామని నేతలు పేర్కొన్నారు. అంతకుముందు, రాష్ట్రంలోని రాజకీయ పక్షాలతో కేకే శర్మ సమావేశం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు.