Anantahpuram: ఏపీకి ‘కియా’ ఎందుకు వచ్చిందో మనోహర్ భట్ స్పష్టంగా చెప్పారుగా!: టీడీపీ ఎంపీ కనకమేడల

  • తమిళనాడు నాయకులు లంచం అడిగారు
  • దీంతో, ఏపీకి ‘కియా’ తరలి వచ్చింది
  • ఈ విషయాలను మార్కెటింగ్ హెడ్ మనోహర్ చెప్పారు

ఏపీకి కియా మోటార్స్ సంస్థ రావడానికి కారణం ప్రధాని మోదీయే నని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఖండించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ, కియా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తమిళనాడు నాయకులు తమ కంపెనీకి ఇచ్చే భూమి విలువకు 50 రెట్లు లంచం అడిగారని, దీంతో, ఏపీకి ‘కియా’ తరలిపోవాలని నిర్ణయించుకుందని మనోహర్ భట్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కియా పరిశ్రమ ఏర్పాటుకు అనంతపురంను ఎంపిక చేయడం వెనుక చంద్రబాబు కృషి ఎంతో ఉందని, తమ పరిశ్రమకు ఎన్నో రాయితీలు ఇచ్చారని, ఈ పరిశ్రమ ఏపీకి వెళ్లడం వల్ల తమిళనాడు 110 కోట్ల డాలర్ల పెట్టుబడిని కోల్పోయిందని, అనుబంధ పరిశ్రమలు, ఉద్యోగాలు పోయాయని తమిళనాడు పారిశ్రామికవేత్త కన్నన్ రామస్వామి చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.  

  • Loading...

More Telugu News