India: భారత నేవీ కొత్త చీఫ్ గా కరంబీర్ సింగ్ నియామకం
- మే 31న ప్రస్తుత చీఫ్ సునీల్ లాంబా పదవీ విరమణ
- 1980లో నేవీలో చేరిన కరంబీర్
- హెలికాప్టర్ పైలట్ గా గుర్తింపు
భారత నేవీకి కొత్త చీఫ్ వచ్చారు. విశాఖపట్నంలోని ఈస్ట్రన్ నావల్ కమాండ్ లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా పనిచేస్తున్న కరంబీర్ సింగ్ ను పదోన్నతిపై ఇండియన్ నేవీ చీఫ్ గా నియమించారు. ప్రస్తుతం నేవీ చీఫ్ గా వ్యవహరిస్తున్న సునీల్ లాంబా మే 31న పదవీ విరమణ చేయనున్నారు. లాంబా స్థానంలో కరంబీర్ బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. 1980లో ఇండియన్ నేవీలో ప్రవేశించిన కరంబీర్ 1982లో హెలికాప్టర్ పైలట్ గా పదోన్నతి అందుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్ లో ఆయన అనేక నేవీ కేంద్రాల్లో పనిచేసి వైస్ అడ్మిరల్ గా ఎదిగారు.