: రైల్వే ముడుపుల దర్యాప్తు 90 రోజుల్లో పూర్తి చేస్తాం: సీబీఐ చీఫ్
మాజీ కేంద్ర మంత్రి పవన్ కుమార్ బన్సల్ పదవి ఊడడానికి కారణమైన రైల్వే ముడుపుల వ్యవహారంలో దర్యాప్తును మూడు నెలల్లో పూర్తి చేస్తామని సీబీఐ చీఫ్ రంజిత్ సిన్హా చెప్పారు. విచారణను నీరుగార్చేలా ఎలాంటి ఒత్తిళ్ళు పనిచేయబోవని, తమ అధికారులు పూర్తి చిత్తశుద్ధితో కేసులో మూలాలను అన్వేషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో నగదు చేతులు మారిందన్న కోణంలోనే ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పిన సిన్హా.. విచారించేందుకు గాను బన్సల్ కు సమన్లు ఏమైనా జారీ చేశారా? అన్న ప్రశ్నకు జవాబిచ్చేందుకు నిరాకరించారు. నేడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.