India: మరోసారి పెద్ద మనసు చాటుకున్న విప్రో అధినేత... రూ.52 వేల కోట్ల విరాళం

  • అజీమ్ ప్రేమ్ జీ భారీ వితరణ
  • ఇప్పటివరకు రూ.1.45 లక్షల కోట్ల విరాళం
  • 'విప్రో' వాటాల్లో 67 శాతం ఛారిటీల పరం

భారత్ లో ఐటీ విప్లవానికి వెన్నుదన్నుగా నిలిచిన స్వదేశీ సంస్థ విప్రో. ఈ సంస్థ అధినేత అజీమ్ ప్రేమ్ జీ వ్యాపారంలోనే కాదు దాతృత్వంలోనూ ముందున్నారు. తన పేరిట అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆయన దేశంలో నాణ్యమైన విద్య, సమానత్వం కోసం తన ఆస్తిలో చాలాభాగం దానం చేశారు. తన ఫౌండేషన్ ద్వారా అనేక స్వచ్ఛంద సేవాసంస్థలకు చేయూతనిస్తున్నారు.

ఈ క్రమంలో అజీమ్ ప్రేమ్ జీ తాజాగా రూ.52 వేల కోట్ల విలువ చేసే తన వాటాలను విరాళంగా ప్రకటించారు. విప్రోలో ఉన్న తన వాటాల్లో 34 శాతం తాజాగా దాతృత్వ కార్యక్రమాల కోసం వితరణ చేస్తున్నట్టు అజీమ్ ప్రేమ్ జీ ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో కూడా ఇదే తరహాలో భారీగా విరాళం అందించారు విప్రో అధినేత. దాంతో విప్రోలోని తన షేర్లలో ఇప్పటివరకు 67 శాతం ఛారిటీ కార్యక్రమాల కోసం విరాళంగా ఇచ్చినట్టయింది.

  • Loading...

More Telugu News