Andhra Pradesh: మంత్రి శిద్ధాను చుట్టుముట్టిన కార్యకర్తలు!
- దర్శి నుంచే పోటీ చేయాలని విజ్ఞప్తి
- అధిష్ఠానం నిర్ణయంపై వ్యతిరేకత
- అసెంబ్లీ సీటు శిద్ధా సుధీర్ కు ఇవ్వాలంటూ డిమాండ్
టీడీపీలో టికెట్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ల విషయంలో నేతలు రాజీపడినా కార్యకర్తలు ఊరుకోవడంలేదు. తాజాగా, ప్రకాశం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి శిద్ధా రాఘవరావుకు ఆశ్చర్యకరమైన పరిస్థితి ఎదురైంది. ఆయనకు ఒంగోలు పార్లమెంటు స్థానం కేటాయించింది టీడీపీ హైకమాండ్. దాంతో దర్శిలో తీవ్ర ఉద్రిక్తభరిత పరిస్థితులు ఏర్పడ్డాయి. దర్శి టీడీపీ ఆఫీసులో కార్యకర్తలు మంత్రి శిద్ధా రాఘవరావును చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఆయన దర్శి నుంచే అసెంబ్లీకి పోటీ చేయాలంటూ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన ఒంగోలు లోక్ సభ బరిలో దిగేట్టయితే ఆయన తనయుడు శిద్ధా సుధీర్ కు దర్శి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలంటూ టీడీపీ హైకమాండ్ ను డిమాండ్ చేశారు.