Andhra Pradesh: టీడీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • ప్రజలకే ముందు చెబుతా
  • జరుగుతున్నది ప్రచారం మాత్రమే
  • స్పష్టం చేసిన మాజీ ఐపీఎస్

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీపై కొన్నాళ్లుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో ఈ విషయం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఒకవేళ టీడీపీలో చేరితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేస్తారా? అంటూ చర్చలు మొదలయ్యాయి. దీనిపై లక్ష్మీనారాయణ స్పష్టతనిచ్చారు. ఇది కేవలం ప్రచారం మాత్రమేనని, తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని అన్నారు. రాజకీయాలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ముందుగా తెలిపేది ప్రజలకేనని చెప్పారు. గతంలో కూడా లక్ష్మీనారాయణ సొంత పార్టీ పెడుతున్నట్టు విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత అందులో నిజంలేదని తేలింది.

  • Loading...

More Telugu News