KCR: ​ 'లక్కీ ప్లేస్' నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న కేసీఆర్

  • మార్చి 17న ప్రచార పర్వం షురూ
  • కరీంనగర్ లో తొలి సభ
  • ఎంపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యమని ఎమ్మెల్యేలకు ఉద్బోధ

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికను త్వరగా ముగించి ప్రచారంలో దిగాలని భావిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. తనకు బాగా కలిసొచ్చిన కరీంనగర్ పట్టణం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నారు. మార్చి 17న ఇక్కడ జరిగే భారీ బహిరంగ సభతో ప్రచార పర్వం మొదలుపెట్టనున్నారు కేసీఆర్. ఆ తర్వాత మార్చి 19న నిజామాబాద్ లో మరో సభలో పాల్గొంటారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలందరికీ స్పష్టమైన ఆదేశాలు అందాయి. ప్రతి ఎమ్మెల్యే కూడా పార్టీ తరఫున బరిలో దిగుతున్న ఎంపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.

కేసీఆర్ కు కరీంనగర్ తో ఎంతో అనుబంధం ఉంది. ఆయన ఇక్కడి నుంచి పార్లమెంటుకు వరుసగా మూడు సార్లు ఎన్నికయ్యారు. అంతేకాదు, తాను సీఎం అయ్యాక మొదటగా పర్యటించింది కరీంనగర్ లోనే. గతేడాది ఇక్కడి నుంచే ప్రతిష్ఠాత్మక రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. 2001లో తెలంగాణ సెంటిమెంట్ రగిల్చిన 'సింహగర్జన' సభకు కూడా కరీంనగరే వేదికైంది.

  • Loading...

More Telugu News