: బెంగళూరు ఓటమి మంచిదే..!


రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో గెలిచి ఫ్లే ఆఫ్ బెర్తుకు మరింత చేరువవ్వాలని ఆశించిన బెంగళూరు భంగపడింది. పంజాబ్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. చాన్నాళ్ళ తర్వాత ఫామ్ లో కొచ్చిన కెప్టెన్ ఆడమ్ గిల్ క్రిస్ట్ (54 బంతుల్లో 85 నాటౌట్: 10 ఫోర్లు, 3 సిక్సులు) పంజాబ్ ను విజయపథంలో నడిపించాడు. ఫిఫ్టీ సాధించిన అజార్ మహ్మూద్ (61) జట్టు గెలుపులో తన వంతు సహకారం అందించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు 5 వికెట్లకు 174 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఓటమితో బెంగళూరు ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా కాగా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తాజా పరిణామం మేలు చేసేదే. ఎందుకంటే, ఈ మ్యాచ్ కు ముందు వరకు ఈ రెండు జట్లు చెరో 16 పాయింట్లతో సమవుజ్జీలుగా ఉన్నాయి. ఇప్పుడు 15 మ్యాచ్ లాడిన బెంగళూరుకు మరో మ్యాచ్ మాత్రమే మిగిలుండగా.. సన్ రైజర్స్ ఇంకా రెండు మ్యాచ్ లాడాల్సివుంది. ఈ రెండింటినీ గెలిస్తే ఎలాంటి ఢోకా లేకుండా సన్ రైజర్స్ నేరుగా ప్లే ఆఫ్ దశకు చేరుకుంటుంది. అలాకాకుండా, ఈ రెండింటిలో ఏ ఒక్కదాంట్లో ఓడినా, బెంగళూరు తన చివరి లీగ్ పోరులో గెలిచినా.. సన్ రైజర్స్ కు తిప్పలు తప్పవు. అప్పుడు రన్ రేట్ కీలకమవుతుంది.

  • Loading...

More Telugu News