: రేపట్నుంచి సిడ్నీలో సాహసక్రీడ కెవాలియా
కౌబోయ్ సినిమాల్లో విన్యాసాలు చూడాలనుకుంటున్నారా?... గుర్రపు స్వారీలు... ఒళ్ళు గగుర్పొడిచే సాహసకృత్యాలను వీక్షించాలనుకుంటున్నారా? అయితే రేపట్నుంచి మే 26 వరకూ సిడ్నీలో జరగనున్న కెవాలియా స్పోర్ట్స్ కి వెళ్లాల్సిందే. సాహసక్రీడల్ని అభిమానించే వారికి ఎంతో ఇష్టమైన క్రీడ కెవాలియా. ఇందులో మనిషికీ గుర్రానికీ ఉన్న అద్భుతమైన సమన్వయాన్ని కనురెప్ప వేయకుండా చూడొచ్చు. అశ్వాల మీద రౌతులు చేసే విన్యాసాలు చూపరులను ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేస్తాయి. అశ్వంతో చేసే అద్భుతాలు వర్ణించేందుకు మాటలు ఉండవంటే అతిశయోక్తి కాదు. అందుకే కళాపిపాసులు, సాహసాలను ఇష్ఠపడేవారు కెవాలియాకు వెళ్లేందుకు ఉవ్విళ్ళూరుతారు. సాహసప్రియులూ ఇంకెందుకాలస్యం...!