: ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: యెన్నం
తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇంటింటికీ తెలంగాణ పేరుతో ప్రతి గ్రామంలో ఉద్యమ కమిటీలు వేస్తామన్నారు. జూన్ 3 న నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు, ఈ బహిరంగ సభకు రాజ్ నాధ్ సింగ్ హాజరుకానున్నట్టు తెలిపారు. ఈ సభా వేదికగా నాగంతో పాటూ మరికొంతమంది నేతలు తమ పార్టీలో చేరుతారని తెలిపారు.