: మమతకు హైకోర్టులో చుక్కెదురు


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో చుక్కెదురైంది. పంచాయితీ ఎన్నికల నిర్వహణ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్పీల్ ను కలకత్తా హైకోర్టు తోసిపుచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై ఇప్పటికిప్పుడు పంచాయితీ ఎన్నికలను నిర్వహించలేమంటూ ప్రభుత్వం అప్పీలు చేసుకుంది. దీంతో హైకోర్టు పంచాయితీ ఎన్నికలను జూలై 15 లోగా మూడుదశల్లో నిర్వహించాలని ఆదేశించింది. 400 మంది పరిశీలకులను నియమించాలని, అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి కానీ, కేంద్రం నుంచి గానీ బలగాల సహాయం తీసుకోవచ్చని సూచించింది. ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపి మూడు రోజుల్లోగా ఎన్నికల తేదీలు ప్రకటించాలని స్పష్టం చేసింది.

దీదీకి బెంగాల్ లో అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. యూపీఏకి మద్దతు ఉపసంహరించిన నాటి నుంచీ మమత తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. తాజాగా శారదా చిట్ ఫండ్ స్కాంలో మంత్రివర్గంలోని పలువురికి సంబంధం ఉందంటూ ప్రతిపక్షాలు ఆందోళనలు కూడా చేసాయి. మరో వైపు, దీదీ మంత్రి వర్గ సహచరులు వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నారు. దీంతో ప్రజల్లో దీదీ మ్యాజిక్ పనిచెయ్యడం లేదని భావించిన మమత ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలని వాయిదా వేసే ప్రయత్నం చేసింది. కానీ, హైకోర్టు ఆదేశాలతో బెంగాల్ అధికార పక్షం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.

  • Loading...

More Telugu News