: పార్కింగ్ మాఫియాపై ఓయూ జేఏసీ ఆందోళన


పార్కింగ్ మాఫియాపై ఓయూ జేఏసీ విద్యార్థులు గళమెత్తారు. మహానగరంలో పలు చోట్ల పార్కింగ్ పేరిట అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నా, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. హైదరాబాద్ లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని ఓయూ జేఏసీ నేతలు ముట్టడించారు. పార్కింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ కార్యాలయంలోకి చొచ్చుకెళ్ళేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు విద్యార్థినాయకుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News