: కేసీఆర్ తో సినిమా తీస్తానంటున్న మంత్రి
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కేసీఆర్ అంగీకరిస్తే ఆయనతో సినిమా తీసేందుకు సిద్ధమంటున్నారు రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్. అంతేగాకుండా, ఆ సినిమాను సందేశాత్మక ఇతివృత్తంతో నిర్మించి సమైక్యవాదులకు అంకితం ఇస్తానంటున్నారు. హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడిన టీజీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ధూమపానానికి స్వస్తి చెప్పి వ్యవసాయంపై అనురక్తి పెంచుకోవడాన్ని ఆయన స్వాగతించారు. దీన్నో శుభపరిణామంగా అభివర్ణించారు.