: జగన్ తో భేటీ కానున్న కొండా దంపతులు


వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కొండా సురేఖ, మురళి నేడు చంచల్ గూడ జైలులో ఆపార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కొండా దంపతులు జగన్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత కొంత కాలంగా వరంగల్ జిల్లాలో కొండా అనుచరగణం పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉంది. తాజాగా జరిగిన పార్టీ సమావేశానికి కూడా ఈ దంపతులు డుమ్మా కొట్టారు. దీంతో వీరు పార్టీ మారుతున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజా భేటీలో తమ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

  • Loading...

More Telugu News