amatavati: అమరావతిలో ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్!

  • జేవియర్ లేబర్ రిలేషన్స్ విద్యాసంస్థకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
  • 50 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్
  • 5 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూషన్ (ఎక్స్ఎల్ఆర్ఐ) కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ విద్యాసంస్థ కోసం తుళ్లూరు మండలం ఐనవోలులో భూమిని ప్రభుత్వం కేటాయించింది. రెండేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

దేశంలోని అత్యున్నత బిజినెస్ మేనేజ్ మెంట్ విద్యాసంస్థల్లో ఒకటిగా జేవియర్ ఉంది. జంషెడ్ పూర్, నోయిడా, ముంబై తర్వాత తన నాలుగవ క్యాంపస్ ను అమరావతిలో ఏర్పాటు చేస్తోంది. ఈ క్యాంపస్ ద్వారా పీజీ, యూజీ మేనేజ్ మెంట్ కోర్సుల్లో 5వేల మందికి ప్రవేశాలను కల్పించనున్నారు. ఈ ఏడాది నుంచే తరగతులను ప్రారంభించేందుకు మేనేజ్ మెంట్ ఏర్పాట్లు చేస్తోంది.

  • Loading...

More Telugu News