YSRCP: చంద్రబాబుపై వైసీపీ వినూత్న ప్రచారం.. నేటి నుంచి ‘నిన్ను నమ్మం బాబు’

  • రోజుకు రెండు చొప్పున బహిరంగ సమావేశాలు
  • చంద్రబాబును నమ్మొద్దంటూ ప్రచారం
  • 9న ముగియనున్న జగన్ పాదయాత్ర

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో అధికారంపై కన్నేసిన వైసీపీ వినూత్న ప్రచారానికి తెరతీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నేటి నుంచి ఈ నెల ఏడో తేదీ వరకు ‘నిన్ను నమ్మం బాబు’ పేరుతో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది.

 ఇందులో భాగంగా రోజుకు రెండు చొప్పున పది గ్రామాల్లో బహిరంగ సమావేశాలు నిర్వహిస్తారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఈ సమావేశాల్లో వివరించనున్నారు. 14 నెలల క్రితం ప్రారంభమైన వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర ఈ నెల 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబును నమ్మొద్దంటూ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయించింది.

  • Loading...

More Telugu News