: ఏ పార్టీలో చేరేది రేపు మధ్యాహ్నం చెబుతా: కడియం


తెలుగుదేశం పార్టీని వీడిన సీనియర్ నేత కడియం శ్రీహరి తాను ఏ పార్టీలో చేరేది రేపు మధ్యాహ్నం వెల్లడిస్తానని చెప్పారు. ఆయన నేడు ఓ టీవీ చానల్ తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణపై చంద్రబాబు అస్పష్ట వైఖరి కారణంగానే పార్టీని వీడాల్సి వచ్చిందని తెలిపారు. అంతేగానీ, పదవులకు ఆశపడి టీడీపీ నుంచి బయటికి రాలేదని స్పష్టం చేశారు. బాబుపైనా, టీడీపీలోని ఇతర నేతలపైనా తనకు గౌరవం ఉందని, అయితే, తన వ్యక్తిత్వానికి భంగం వాటిల్లేలా వారు విమర్శలకు దిగితే చూస్తూ ఊరుకోనని కడియం హెచ్చరించారు. వారిపైనా ప్రతిదాడులకు దిగుతానని ఆయన అన్నారు. అయితే తాను చేసే విమర్శలు అర్థవంతంగా ఉంటాయని వివరించారు.

  • Loading...

More Telugu News