KCR: కేసీఆర్ కి రాజకీయ జీవితాన్నిచ్చింది టీడీపీ కాదా?: సీఎం చంద్రబాబు

  • కేసీఆర్ ఎక్కడి నుంచైనా ఊడిపడ్డారా?
  • నా దగ్గర కేసీఆర్ మంత్రిగా పని చేయలేదా?
  • వచ్చే ఎన్నికల్లో మోదీ, వైసీపీ, మీరు కలిసి పోటీ చేయండి

'కేసీఆర్ ఎక్కడి నుంచైనా ఊడిపడ్డారా? కేసీఆర్ కి రాజకీయ జీవితాన్నిచ్చింది టీడీపీ కాదా? నా దగ్గర కేసీఆర్ మంత్రిగా పని చేయలేదా?' అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నేనేదో అవకాశవాదినని మాట్లాడతాడు. నువ్వు ఉద్యమం పెట్టి.. 2004లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నువ్వు ఎందుకు పోటీ   చేశావు? అప్పుడు మిమ్మల్ని తిరస్కరించలేదా?

తర్వాత 2009లో టీడీపీతో సీట్లు ఎడ్జస్ట్ చేసుకోలేదా? నేను ఇవ్వనని ఆ రోజున చెప్పాను. ‘నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు వద్దు’ అని చెప్పాను. ‘ఎన్ని సీట్లిస్తే అన్ని సీట్లు తీసుకుంటానంటే 44 సీట్లిస్తే పది గెలిచారు. ఇది వాస్తవం కాదా? ఎవరిది అవకాశవాద రాజకీయం? తెలంగాణ ఇస్తే పార్టీని కలిపేస్తానని కాంగ్రెస్ తో చెప్పావు! ఏం చేశారు? ఇప్పుడు వాళ్లు (కాంగ్రెస్) ఇడియట్స్ అయిపోయారు’ అని కేసీఆర్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు.

‘వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీ, వైఎస్సార్ కాంగ్రెస్, మీరు కలిసి పోటీ చేయండి. మీకు ఎవరు అడ్డమున్నారు? పోటీ చేస్తే ప్రజలే చెబుతారు. ఎందుకీ, ముసుగులో గుద్దులాట?’ అని ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News