KCR: ప్రతీ పౌరుడి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి: కేసీఆర్

  • కంటి వెలుగు శిబిరాల మాదిరిగానే చెవి, గొంతు, ముక్కు, దంత పరీక్షలు నిర్వహించాలి
  • ఫిబ్రవరిలో ఈ శిబిరాలు నిర్వహించాలి
  • విద్య, వైద్య రంగాలకు ఈ దఫా అత్యధిక ప్రాధాన్యత

నీటి పారుదల రంగానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రాముఖ్యతను కొనసాగిస్తూనే, విద్య, వైద్య రంగాలకు ఈ దఫా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల నిర్వహణ విజయవంతంగా జరుగుతున్నదని, ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నదని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

కంటి వెలుగు శిబిరాల మాదిరిగానే ప్రజలందరికీ చెవి, గొంతు, ముక్కు, దంత పరీక్షలు నిర్వహించాలని సీఎం అన్నారు. ఫిబ్రవరిలో ఈ శిబిరాలు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రజలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రతీ పౌరుడి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ఆదేశించారు. ఆ ప్రొఫైల్ ఆధారంగా హెల్త్ స్టేటస్ ఆఫ్ తెలంగాణ తయారు చేయాలని సీఎం చెప్పారు.

  • Loading...

More Telugu News