YSRCP: జేసీ నోరు అదుపులో పెట్టుకోకపోతే..మేం నోరు విప్పుతాం: వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి

  • జేసీ సంస్కారం మరిచి వ్యాఖ్యలు చేస్తున్నారు
  • జగన్ ఏనాడూ సంస్కార హీనంగా మాట్లాడలేదు
  • జేసీ పిచ్చికూతలు కూస్తుంటే చంద్రబాబు నవ్వుతారా!

అనంతపురం ధర్మపోరాట దీక్ష సభలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇంకా కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. జేసీ దివాకర్ రెడ్డి తన నోరు అదుపులో పెట్టుకోకపోతే, తాము నోరు విప్పాల్సి వస్తుందని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.

హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జేసీ తన సంస్కారం మరిచి జగన్ గురించి వ్యాఖ్యలు చేయడం దారుణమని, జగన్ వందల సభల్లో మాట్లాడినా ఏనాడూ సంస్కారహీనంగా మాట్లాడలేదని అన్నారు. కులం పేరుతో జేసీ పిచ్చికూతలు కూస్తుంటే చంద్రబాబు నవ్వుతూ ఎంజాయ్ చేశారని విమర్శించారు.

జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ మేనిఫెస్టోలో కులాల పేరుతో పథకాలు పెట్టింది బాబు కాదా? కులాల పేరిట తిట్టించి లబ్ధి పొందడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో మోత్కుపల్లి నర్సింహులు, నాగం జనార్దన్ రెడ్డిలను చంద్రబాబు ఇలాగే ఉపయోగించుకున్నారని విమర్శించారు.   

  • Loading...

More Telugu News