modi: మోదీతో ముగిసిన కేసీఆర్ భేటీ.. 16 అంశాలపై వినతి

  • సుమారు నలభై నిమిషాల పాటు సమావేశం
  • రాష్ట్ర పునర్విభజన హామీలు అమలు చేయాలని వినతి
  • ‘కాళేశ్వరం’కు జాతీయ హోదా కల్పించాలన్న కేసీఆర్

ఢిల్లీలో ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. 7 లోక్ కల్యాణ్ మార్గ్ లోని మోదీ నివాసంలో ఆయన్ని కేసీఆర్ కలిశారు. సుమారు నలభై నిమిషాల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పునర్విభజన హామీలు అమలు చేయాలని కేసీఆర్ కోరినట్టు సమాచారం. ఈ సందర్భంగా సుమారు16 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని మోదీకి కేసీఆర్ అందజేశారు. ఆయా అంశాల పరిష్కారంపై మోదీ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఆ వినతి పత్రంలోని అంశాలు..

- కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా
- కృష్ణా జలాల వివాదం పరిష్కారానికి వినతి
- సెక్రటేరియట్, రహదారి నిర్మాణ పనులకు బైసన్ పోలో గ్రౌండ్ భూముల బదిలీ
- హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు
- కరీంనగర్ లో  ట్రిపుల్ ఐటీ ఏర్పాటు
- హైదరాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ (ఐఐఎస్ఇఆర్)
- ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణ
- నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) - జహీరాబాద్ కోసం నిధుల విడుదల
- కొత్త జిల్లాల్లో 21 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు
- వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైట్  పార్క్ అభివృద్ధికి రూ .1000 కోట్లు కేంద్రం నిధుల విడుదల
- ఏపీ పునర్విభజన చట్టంలో షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన
- ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టుల పనుల పూర్తి అంశం
- ఎస్సీ వర్గీకరణ బిల్లు
- వరంగల్ లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు
- పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల కోసం రూ. 450 కోట్లు    
   గ్రాంట్స్ నిధుల విడుదల
- ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ప్రతిపాదన

  • Loading...

More Telugu News