: బొగ్గు కుంభకోణంలో దాసరిని ప్రశ్నించాం: సీబీఐ


కేంద్రంలో యూపీఏ సర్కారును తీవ్ర ఇరకాటంలోకి నెట్టిన బొగ్గు కుంభకోణంలో మాజీ మంత్రులు దాసరి నారాయణరావు, సంతోష్ బగ్రోడియాలను నెల క్రితమే ప్రశ్నించినట్టు సీబీఐ వెల్లడించింది. సీబీఐ దర్యాప్తులో ప్రభుత్వ జోక్యం ఎక్కువైందంటూ విపక్షం బీజేపీ.. కేంద్ర దర్యాప్తు సంస్థ పంజరంలో చిలుకలా తయారైందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. సీబీఐ స్పందించింది. ఈ కేసులో ఎంతటివారినైనా ఉపేక్షించబోమంటూ సమరశంఖం పూరించింది. దాసరిని నెలక్రితమే విచారించామని తెలిపిన సీబీఐ, ఆ సందర్భంగా కీలక సమాచారం రాబట్టినట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News