: సీఎంకు 'ప్రచార పిచ్చి' పట్టిందంటున్న కిషన్ రెడ్డి


రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి 'పబ్లిసిటి పిచ్చి' పట్టుకున్నట్టుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ప్రవేశపెట్టిన పథకం 'అమ్మహస్తం' తమ ముఖాలను అందరికీ చూపించడం కోసం ఏర్పాటు చేసుకున్న కక్కుర్తి హస్తంలా తయారైందని కిషన్ రెడ్డి విమర్శించారు. 'అమ్మహస్తం' ద్వారా అందించే సరుకుల ప్యాకెట్లపై నిలువెత్తు ఫొటోలు ముద్రించి ప్రచారం సాగించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

'అమ్మహస్తం' పథకం ద్వారా అందించే సరుకుల ప్యాకెట్లపై సీఎం కిరణ్ తో పాటు పలువురు మంత్రుల ఫొటోలు ముద్రించి ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై సీఎంపై కిషన్ రెడ్డి వ్యంగ్యోక్తి విసిరారు. ఈ పథకం 'అమ్మహస్తం' కాదని, అరకొర హస్తమని, ఇంకా చెప్పుకోవాల్సి వస్తే మొండి హస్తమని పేర్కొన్నారు. ఈ పథకం అమలు బాధ్యతలు బీజేపీకి ఇస్తే ప్రభుత్వం ఇస్తున్న ధరలో సగానికే సరుకులు సరఫరా చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. 'అమ్మహస్తం' ద్వారా సర్కారు రూ. 185లకే 9 రకాల వస్తువులను అందిస్తోంది.

  • Loading...

More Telugu News