: ఎమ్మెల్యేల విప్ ఉల్లంఘనపై విచారణ షురూ


అవిశ్వాస తీర్మానంలో విప్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై వేటుకు రంగం సిద్దమౌతోంది. విప్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించారు. ఈ విచారణకు ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి న్యాయవాదితో కలిసి హజరయ్యారు. నోటీసులందుకున్న ఎమ్మెల్యేలతో పాటు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్, టీడీపీ ప్రతినిధులు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉండగా విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలు విచారణకు దూరంగా ఉన్నారు.

తొలి రోజు సుజయకృష్ణ రంగారావు, ద్వారంపూడి, ఆళ్ళ నాని, రాజేష్, జోగి రమేష్, పేర్ని నాని, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, రవికుమార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉండగా, రేపు పి. సాయిరాజ్, టి. వనిత, చిన్నం రామకోటయ్య, కొడాలి నాని, బాలనాగిరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, అమరనాథ్ రెడ్డి, వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. రామకోటయ్య, వేణుగోపాలాచారి తమకు విప్ అందలేదని చెబుతుండగా, వారిపైనా చర్యలు తీసుకోవాలని టీడీపీ కోరుతోంది. వీరిపై వచ్చే నెలలో అనర్హత వేటు పడే అవకాశముంది.

  • Loading...

More Telugu News