: నాలుగేళ్లకే నగర మేయరు...!
నాలుగేళ్ల వయసంటే ఆటలాడుకుంటూ గడిపే వయసు. ఇలాంటి వయసులో క్లిష్టమైన నగర మేయర్ పదవిని నిర్వహించడమంటే కాస్త కష్టమేమరి. అయితే మేయర్ పదవిని ఆడుకుంటూ అనుభవిస్తున్నాడు చిన్నారి రాబర్ట్ టఫ్ట్స్. అసలు నాలుగేళ్లకు మేయర్ పదవి రావడం ఏంటా అని మీకు ఆశ్చర్యంగా ఉందా...? మిన్నెసోటాలోని డోర్సెట్ అనే పట్టణంలోని ప్రజలు డ్రా ద్వారా తమ మేయరును ఎన్నుకున్నారు. అందులో రాబర్ట్ టఫ్ట్స్ పేరు ఎంపికయ్యింది. దీంతో ఆ బుడతడిని మేయర్ చేసేశారు.
ఆటలాడుకునే వయసులో అంత పెద్ద పదవి వచ్చినందుకు రాబర్ట్ బాధపడడం లేదు. పైగా తన నగర ప్రజలకు రోడ్డు జాగ్రత్తగా దాటే విషయంలో ఎంతో విలువైన సూచనలు ఇస్తుంటాడు. డ్యాన్సులేస్తాడు, పాటలు పాడుతూ వారిని అలరిస్తుంటాడు. అయితే కీలకమైన నిర్ణయాలు మాత్రం ఆ నగరానికి చెందిన వ్యాపార వర్గాలే నిర్ణయిస్తాయట. ఏదేమైనా నాలుగేళ్లకే నగర మేయరు పదవంటే మాటలు కాదుగా...!