: వైభవంగా కథానాయకుడు గోపీచంద్ వివాహం


యాక్షన్ చిత్రాల కథానాయకుడుగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ ఈ రోజు ఓ ఇంటివాడు అయ్యాడు. రేష్మాతో గోపీ వివాహం ఈ రోజు సాయంకాలం హైదరాబాదు, మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు చలచిత్ర ప్రముఖులు, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చంద్రబాబునాయుడు, దాసరి నారాయణరావు, రామోజీరావు, కేంద్రమంత్రి పురందేశ్వరి, అల్లు అరవింద్, ప్రభాస్, అల్లు అర్జున్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు తదితరులు ఈ వేడుకకు విచ్చేశారు. వధువు రేష్మ మరెవరో కాదు ... హీరో శ్రీకాంత్ మేనకోడలే!

  • Loading...

More Telugu News