: 14 జిల్లాల్లో వాయిదాపడిన ఇంటర్ ప్రయోగ పరీక్షలు
ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల కారణంగా 14 జిల్లాల్లో ఈ నెల 21 నుంచి ప్రారంభం కావలసిన ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో 26 నుంచి పరీక్షలు జరుగనున్నాయి. కొన్ని రోజుల కిందటే ఇంటర్మీడయట్ బోర్డు తేదీలను ప్రకటించింది. అయితే అంతకుముందే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం తేదీలను ఇచ్చింది. ఈ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.