: చేయిచేసుకుంది చిరంజీవి సిబ్బందేనా!?


రామ్ చరణ్ వివాదం మరో మలుపు తిరిగింది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ వద్ద జరిగిన వివాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులను చితకబాదిన వ్యక్తులు చిరంజీవి భద్రత సిబ్బంది అని తెలుస్తోంది. ఇప్పటిదాకా ఆ ఇద్దరు ఐటీ ఉద్యోగులపై దాడి చేసింది రామ్ చరణ్ వ్యక్తిగత సిబ్బంది అని అందరూ భావించారు. అయితే, ఆ బలిష్టమైన వ్యక్తులు కేంద్ర మంత్రి చిరంజీవి భద్రత కోసం నియమితులైన ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్ డబ్ల్యూ) కు చెందినవారని సమాచారం. ఐఎస్ డబ్ల్యూ రాష్ట్ర నిఘా వర్గాల అదుపాజ్ఞల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ విభాగం ముఖ్యవిధి ప్రముఖుల రక్షణ బాధ్యతలు నిర్వర్తించడమే.

కాగా, రామ్ చరణ్ తన భార్యతో హోటల్ లో లంచ్ కు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. రామ్ చరణ్ ఫోన్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే భద్రత సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోవడం చూస్తుంటే.. ఆ సమయంలో చిరంజీవి బంజారాహిల్స్ ప్రాంతంలోనే ఎక్కడో ఉండి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  • Loading...

More Telugu News