: కోర్టు భూమి కబ్జాయత్నం
హైదరాబాదులో కబ్జాకోరులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇప్పటివరకూ ఇళ్ళస్థలాలను కబ్జా చేసిన అక్రమార్కులు తాజాగా కోర్టు స్థలాన్ని మింగేసేందుకు కూడా ప్రయత్నించారు. గంగరాజు అనేవ్యక్తి ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర తమ్ముడినంటూ 5 ఎకరాల స్థలంను కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. అతని ప్రయత్నాన్ని అడ్డుకున్న బార్ అసోసియేషన్ సభ్యులు గంగరాజును కూకట్ పల్లి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన అధికారులు సర్వే నంబర్ 978లోని 5 ఎకరాల స్థలం కోర్టులకోసం కేటాయించిన భూమిగా గుర్తించారు.