: విజయవాడకు కొత్త కోర్టుల సముదాయం
విజయవాడ కోర్టులకు మోక్షం కలిగింది. బ్రిటీష్ కాలంలో నిర్మితమై, శిధిలావస్థకు చేరుకుంటున్న విజయవాడ కోర్టుల సముదాయాన్ని కొత్తగా నిర్మించేందుకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ శంకుస్థాపన చేసారు. అన్ని వసతులతో కూడిన నూతన సముదాయాన్ని 58 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తారు. నూతన కోర్టు భవనాలను నిర్మించాలని డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తున్నా స్థానిక ఎంపీ పాతభవనాల స్థలంపై కన్నేసాడంటూ పలువురు న్యాయవాదులు గతంలో ధర్నాలకు దిగడంతో అప్పట్లో ఆ ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు జస్టిస్ ఎన్ వీ రమణ చొరవతో కొత్త కోర్టుల సముదాయం రూపుదాల్చుకుంటోంది.