: ఆ రెండు శాఖలు సీనియర్ మంత్రులకు అప్పగింత
అవినీతి ఆరోపణలతో కేంద్ర మంత్రి పదవుల నుంచి వైదొలగిన పీకే బన్సల్, అశ్వినీ కుమార్ ల స్థానాలను కాంగ్రెస్ అధిష్ఠానం సీనియర్లతో భర్తీ చేసింది. కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి కపిల్ సిబాల్ కు న్యాయశాఖను.. రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి సీపీ జోషికి రైల్వే శాఖను అప్పగించారు.