Chandrababu: భారీవర్షాలు.. అధికారులూ అప్రమత్తం: సీఎం చంద్రబాబు

  • రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం చంద్రబాబు
  • అంటువ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన 
  • లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం

భారీవర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. భారీవర్షాలతో ఇబ్బంది పడుతున్న కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అధికారులు అంటువ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దివిసీమలో పాముకాటుకు గురై అవనిగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. పొలాలకు వెళ్ళే రైతులు, కూలీలు విషసర్పాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదపు అంచున ఉన్న వంతెనలపై వెళ్లకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, కూలిపోయి, కొట్టుకుపోయిన వంతెనలకు ప్రత్యామ్నాయం లేదా పునర్నిర్మాణం వంటి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి తెలిపారు. విపత్తు నిర్వహణ శాఖ, రియల్ టైమ్ గవర్నెన్స్ సూచనలతో పనిచేయాలని చెప్పిన సీఎం... లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఆదేశించారు. సహాయక చర్యల్లో స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News