Savingsaccounts: 'జీరో బ్యాలెన్స్' సదుపాయం.. కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఖాతాల వెల్లువ!

  • 811 పొదుపు ఖాతా వల్లే పెరిగిన బ్యాంక్ ఖాతాలు 
  • ఎలాంటి చార్జీలు,కనీస నిల్వ కూడా లేకున్నా బ్యాంకింగ్ సేవలు
  •  1.45 కోట్ల కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలందిస్తున్న కోటక్ మహింద్రా బ్యాంక్

కస్టమర్లకు ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ సేవలు భారం అయిన నేపథ్యంలో, ఎలాంటి చార్జీలు లేకుండా సేవలందించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ పొదుపుఖాతా పధకాన్ని అందిస్తోంది. 2017లో ప్రారంభించిన 811 పొదుపు ఖాతా పథకం వల్ల గత 15 నెలల వ్యవధిలో 65 లక్షల మంది తమ బ్యాంకులో ఖాతాలు తెరిచినట్లు కోటక్‌ మహీంద్రా బ్యాంకు వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి మొత్తం ఖాతాదారుల సంఖ్య 1.45 కోట్లకు చేరిందని బ్యాంకు తెలిపింది.

తమకు ఏపీలో 106 శాఖలు, తెలంగాణలో 82 శాఖలు ఉన్నాయనీ, త్వరలోనే ఈ రెండు రాష్ట్రాల్లో కొత్తగా 5 శాఖలు ఏర్పాటు చేయబోతున్నట్లు బ్యాంకు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పునీత్‌ కపూర్‌ చెప్పారు. ఆంధ్రాలో మొత్తం డిపాజిట్లు రూ.3,729 కోట్లు, తెలంగాణలో రూ.8,805 కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు. అదే విధంగా ఏపీలో రూ.3,640 కోట్లు, తెలంగాణలో రూ.7,842 కోట్ల రుణాలు ఇచ్చినట్లు వెల్లడించారు.

     811 పొదుపు ఖాతాతో చాలా ప్రయోజనాలుండటంతో కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పిన పునీత్ కుమార్ ఈ ఖాతాను మొబైల్‌ ఫోను నుండి ఆధార్‌ ఓటీపీ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే ప్రారంభించవచ్చని ఈ ఖాతాలో కనీస నిల్వ (జీరో బ్యాలెన్స్) అవసరం లేదని చెప్తున్నారు. అన్ని రకాల బ్యాంకింగ్‌ సదుపాయాలూ ఎలాంటి చార్జీలు లేకుండా లభిస్తాయని, అంతే కాకుండా ఇందులో రూ.లక్షకు మించి జమ చేసినప్పుడు 6 శాతం వార్షిక వడ్డీని అందిస్తున్నట్లు తెలిపారు. 

  • Loading...

More Telugu News