Chandrababu: అందరూ వ్యతిరేకించడంతో జగన్ తోకముడిచారు: సీఎం చంద్రబాబు
- కుట్ర రాజకీయాలు చేస్తే సహించం
- కొందరు జైలు భయంతోనే కేంద్రానికి ఊడిగం
- ధర్మం మనవైపు ఉంది కనుకే ధర్మపోరాట దీక్ష
యాభై శాతం దాటితే కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదన్న జగన్, అందరూ వ్యతిరేకించడంతో తోకముడిచారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. అనంతపురం జిల్లాలోని పేరూరు ప్రాజెక్ట్ కు నీటిని విడుదల చేసే కాల్వకు ఆయన భూమిపూజ చేశారు.
అనంతరం, ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజల మనోభావాలు దెబ్బతీయడానికి కుట్ర రాజకీయాలు చేస్తే సహించేది లేదని, కేంద్రంతో విరోధం పెట్టుకుంటే జైలులో ఉండాల్సి వస్తుందని కొందరు భయపడుతున్నారని, జైలు భయంతోనే కేంద్రానికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ఏపీకి అన్యాయం చేసిన కేంద్రంపై పోరాడుతున్నామని, ధర్మం మనవైపు ఉంది కనుకే ధర్మపోరాట దీక్షకు దిగామని, ఏదైనా విషయంపై పోరాడాల్సి వస్తే తన తర్వాతే ఎవరైనా అని చంద్రబాబు ఆవేశంగా అన్నారు.