: గాంధీ వస్తువుల వేలాన్ని అడ్డుకోవడం లేనట్లే
మహాత్మా గాంధీకి సంబంధించిన వ్యక్తిగత వస్తువులను లండన్‌లోని ముల్లాక్స్ సంస్థ వేలం వేసేస్తోంది. తాజాగా ఈ వేలం తేదీ ఈనెల 21 అని ప్రకటించారు. గాంధీ వస్తువుల వేలం గురించి ఇదివరకే ప్రకటనలు వచ్చినా.. వాటిని వేలం వేయకుండా ఆపాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. మొత్తానికి ఆ పిటిషన్ ఏం ఫలితం సాధించిందో తెలియదు గానీ.. వేలం మాత్రం జరిగిపోతోంది.
1924లో అనారోగ్యం నుంచి కోలుకుంటున్నప్పుడు గాంధీజీ వాడిన జపమాల, 1921లో ఆయన రాసిన వీలునామా మరియు పవర్ ఆఫ్ అటార్నీ, ఆయన దుప్పటి, దంతంతో మలచిన మూడు కోతుల బొమ్మ ఇతర విలువైన గాంధీజీకి సంబంధించిన పత్రాలు కొన్ని ఈ వేలానికి రానున్నాయి. ఆయన స్వీయ సంతకం ఉన్న ఫోటోలు, లేఖలు కూడా కొన్ని ఉన్నాయిట. జాతిపిత ఆస్తులు.. మన జాతీయ ఆస్తులు కావాలని, వాటి వేలం ఆపాలని ఓ పిటిషన్‌లో గాంధీభక్తులు వాంఛించారు గానీ... వారి ప్రయత్నం సఫలమైనట్లు లేదు.